- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎంపీ అర్వింద్‌పై దాడి.. హోంశాఖకు ప్రివిలేజ్ కమిటీ ఆదేశాలు
దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై జరిగిన దాడిపై విచారణ జరపాలని పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు హోంశాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర డీజీపీ, నిజామాబాద్ పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఆర్మూర్ ఏసీపీ, ఆర్మూర్ సీఐ, ఎస్ఐకి ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. జనవరి 25న నందిపేట మండలం చిన్న యానంలో ఎంపీ నిధులతో నిర్మించిన పాఠశాల ప్రహరీ ప్రారంభానికి ఎంపీ అర్వింద్ వెళుతుండగా కాన్వాయ్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఎంపీ కారుతో పాటు మరో నాలుగు కార్లు ధ్వంసమయ్యాయి. బీజేపీ కార్యకర్తలపై దాడి జరిగింది. ఈ విషయంపై ఆనాడే ఎంపీ అర్వింద్ పార్లమెంటరీ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎంపీ ఫిర్యాదు మేరకు స్పందించిన పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ, ఆయన్ను ఢిల్లీకి రప్పించుకుని వివరాలను సేకరించారు. అందులో భాగంగా గురువారం కమిటీ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో విచారణ నివేదిక సమర్పించాలని కోరింది. అందులో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అభ్యంతరాలు స్వీకరించాలని పేర్కొంది.