నంబర్ ప్లేట్ లేని వాహనాలపై కొరడా ఝలిపిస్తున్న పోలీసులు

by Naresh |   ( Updated:2024-01-09 15:56:39.0  )
నంబర్ ప్లేట్ లేని వాహనాలపై కొరడా ఝలిపిస్తున్న పోలీసులు
X

దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో నెంబర్ ప్లేట్ పూర్తిగా లేని, అనుమానస్పద వాహనాలపై పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే 74 వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ లో ఉంచారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడిపిన 9 మందిపై కేసులు కూడా నమోదు చేశారు. పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి వాహనదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ... వాహనదారులు తమ వాహనాలకు నంబర్ ప్లేట్స్ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఉంచుకోవాలని, లేనిచో వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేగాకుండా వారిపై సంబంధిత కోర్టులో అభియోగ పత్రంలో వేస్తామన్నారు. ఈ వాహనాల తనిఖీల్లో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌హెచ్‌ఓలు, ఎస్సైలతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed