అందరికీ న్యాయం జరిగేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాం:డిప్యూటీ సీఎం

by Naveena |
అందరికీ న్యాయం జరిగేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాం:డిప్యూటీ సీఎం
X

దిశ,సత్తుపల్లి: మీ అందరికీ న్యాయం జరిగేలా సింగరేణి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు.ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధి లోని జగన్నాధపురం R&R కేంద్రం లో సింగరేణి ఆధ్వర్యం లో..చేపట్టిన అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క,స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ తో కలిసి శనివారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. అనంతరం సింగరేణి ప్రభావిత ప్రాంతమైన జలగం వెంగళరావు నగర్ లో సింగరేణి సిఎండి బలరాం నాయక్ తో కలిసి పర్యటించారు.సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ లోని బాంబ్ బ్లాస్టింగ్స్ కారణంగా..దెబ్బతిన్న ఇళ్లను స్వయంగా పరిశీలించి మరమత్తులు చేపట్టేందుకు ఓపెన్ టెండర్ ను వేయాలని సింగరేణి అధికారులను ఆదేశించారు.త్రాగు నీటి కోసం ఆర్ వో ప్లాంట్ ను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని ప్లాంట్ ను పట్టించుకోకుండా వెళ్లే కాంట్రాక్టర్ల ను ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టటం లేదన్నారు.పనులు చేసి పట్టించుకోని కాంట్రాక్టర్లను అవసరమైతే అరెస్టు చేయాలన్నారు. ఈ పర్యటనలో జే వి ఆర్ ఓ సి సింగరేణి పిఓలు ఎన్ వి ఫి ప్రహ్లాద్, నరసింహారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ దయానంద విజయ్ కుమార్, ఎమ్మార్వో యోగేశ్వరరావు, ఎంపీడీవో చిన్న నాగేశ్వరరావు, ప్రభుత్వ అధికారులు, సింగరేణి అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, సింగరేణి బాధితులు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Advertisement

Next Story