ఉప్పల్ లో పరుగుల సునామీ.. చరిత్ర సృష్టించిన టీమిండియా.. టీ20 హిస్టరీ లోనే ఫస్ట్ టైమ్

by karthikeya |   ( Updated:2024-10-12 16:00:45.0  )
ఉప్పల్ లో పరుగుల సునామీ.. చరిత్ర సృష్టించిన టీమిండియా.. టీ20 హిస్టరీ లోనే ఫస్ట్ టైమ్
X

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా పరుగుల సునామీ సృష్టించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 3వ ఓవర్లోనే అభిషేక్ శర్మ (4) వికెట్ కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ సంజు శాంసన్.. వన్ డౌన్‌లో వచ్చిన సూర్యతో కలిసి బంగ్లా బౌలింగ్ ఎటాక్‌ను ధాటిగా ఎదుర్కొంటున్నాడు. సంజు శాంసన్ (47 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో 111 పరుగులు) సెంచరీతో బంగ్లా బౌలింగ్ అటాక్‌ను ఊచకోత కోయగా.. అతడికి వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 75 పరుగులు) హాఫ్ సెంచరీతో తోడుగా నిలబడ్డాడు. ఇక 192 పరుగుల పార్ట్‌నర్‌షిప్ తర్వాత వీళ్లిద్దరూ వరుస ఓవర్లలో అవుట్ కావడంతో టీమిండియా స్కోర్ బోర్డ్ కొద్దిగా స్లో అయింది. అయితే ఆ తర్వాత రియాన్ పరాగ్ (34), హార్దిక్ పాండ్యా (47) చివర్లో అదరగొట్టారు. దీంతో టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్రపంచ క్రికెట్లో ఓ టెస్ట్ ప్లేయింగ్ జట్టు సాధించిన అత్యధిక టీ20 స్కోర్‌గా ఈ స్కోర్ రికార్డులకెక్కింది.

Advertisement

Next Story