అదాని అంబుజా కాలుష్య సిమెంట్ ఫ్యాక్టరీని వ్యతిరేకిద్దాం..

by Naveena |
అదాని అంబుజా కాలుష్య సిమెంట్ ఫ్యాక్టరీని వ్యతిరేకిద్దాం..
X

దిశ,రామన్నపేట : పర్యావరణాన్ని దెబ్బతీసి, ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చే అధాని అంబుజా కాలుష్య సిమెంట్ ఫ్యాక్టరీని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని శనివారం విజయదశమి రోజున అఖిలపక్ష పార్టీల నాయకులు, ప్రజలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పట్టణ కేంద్రంలోని స్థానిక సుభాష్ సెంటర్లో 15 నిర్వహించే సదస్సు కడపత్రాలను ఆవిష్కరించారు. అక్టోబర్ 15న రహదారి బంగ్లాలో జరిగే సదస్సును అన్ని పార్టీల నాయకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈనెల 23న ఆధాని అంబుజా ఫ్యాక్టరీ నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణను ప్రజలందరూ చైతన్యవంతులై అడ్డుకోవాలని కోరారు. కాలుష్య కారక అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నెలకొల్పితే ఈ ప్రాంతమంతా దుమ్ముధూళి దట్టమైన పొగ పొల్యూషన్లతో ప్రజల ప్రాణాలు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైపోర్ట్ లాజిస్టిక్ పార్కు పేరుతో కంపెనీ ఏర్పాటు చేస్తామని అదాని యాజమాన్యం రైతులను మోసం చేసి 400 ఎకరాల భూమిని కొనుగోలు చేసిందని అన్నారు. ఫ్యాక్టరీని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయకుండా విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ గోదాసు శిరీష పృథ్వీరాజ్ నకిరేకంటి మొగులయ్య, ఊట్కూరి నరసింహ, సాల్విర్ అశోక్ చారి జిల్లా వెంకటేశం కందుల హనుమంతు మిర్యాల మల్లేష్ గరిక సత్యనారాయణ గొరిగే నరసింహ, కందుల హనుమంతు, గోలుసుల ప్రసాద్, మునుకుంట్ల లెనిన్, గొరిగే మల్లేష్, బొడ్డు సురేందర్ రావు, భావాండ్లపల్లి బాలరాజు, ఈతాపుల రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story