వీలైతే నాలుగు మాటలు..కుదిరితే కప్పు కాఫీ..!

by Naveena |   ( Updated:2024-10-12 15:01:15.0  )
వీలైతే నాలుగు మాటలు..కుదిరితే కప్పు కాఫీ..!
X

ఖమ్మం : వీలైతే నాలుగు మాటలు.... కుదిరితే కప్పు కాఫీ అంటూ విజయదశమి పర్వదినం వేళ సరదాగా పలకరించేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకుల ఇళ్లకు ఆత్మీయ అతిథిగా వెళ్ళారు. కులాసా కబుర్లు చెబుతూ ఆయా నాయకుల ఇళ్ళ వద్ద కాసేపు కాలక్షేపం చేశారు. పండుగ వేళ అనుకోని అతిథిగా శీనన్న రావడంతో..నాయకులతో పాటు వారి కుటుంబ సభ్యుల ఆనందాలకు అవధులు లేవు. వారి కుటుంబ సభ్యుల్లోని ప్రతి ఒక్కరినీ పలరిస్తూ మంత్రి పొంగులేటి వారికి దసరా శుభాకాంక్షలు తెలిపారు. అశ్వారావుపేటలో కాంగ్రెస్ నాయకుడు జూపల్లి రమేష్ ..సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఆలపాటి రాము,వైరా లోకాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బొర్రా రాజశేఖర్ ,ఖమ్మం రూరల్ మండలంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ధరావత్ రామ్మూర్తి నాయక్,సుమంచి మండలంలో దండ్యాల లక్ష్మణ రావు ఇంటికి వెళ్లి వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు.

Advertisement

Next Story