- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాత నేరస్థుడిని పట్టించిన సీసీ కెమెరాలు
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి పట్టణంలోని ఐదు ఇళ్ళల్లో దొంగతనాలకు పాల్పడ్డ బిక్కాజి రంజిత్ అనే పాత నేరస్థుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 11 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి దొంగతనం కేసు వివరాలను వెల్లడించారు. బిక్కాజి రంజిత్ అనే పాత నేరస్థుడిని సీసీ కెమెరాలు ఆధారంగా పట్టుకున్నామని తెలిపారు.
అతని వద్ధ నుంచి 14 తులాల బంగారు ఆభరనాలు, 1.కేజీ 10 గ్రాముల వెండి ఆభరణాలు, 32 వేల రూపాయల నగదు, ఒక మొబైల్ ఫోన్, ఒక టీవీని అతని వద్ద నుండి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బిక్కాజీ రంజీత్ గతంలో 11 నేరాలు చేసి జైలుకు వెల్లివచ్చినట్టు ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై ప్రసాద్, సయ్యద్, రవికిరణ్, రామస్వామి, లక్ష్మణ్, నరేష్, పాల్గొన్నారు.