రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో న్యూ కామన్ డైట్ మెనును ప్రారంభించిన పోచారం

by Mahesh |
రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో న్యూ కామన్ డైట్ మెనును ప్రారంభించిన పోచారం
X

దిశ, బాన్సువాడ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాల విద్యార్థులకు పెంచిన డైట్, కాస్మొటిక్ చార్జీలకు బాన్సువాడ మండల పరిధిలోని బోర్లం మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో న్యూ కామన్ డైట్ మెను‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు ప్రారంభించారు. అనంతరం పాఠశాల మెస్‌ను తనిఖీ చేసి కూరగాయలను, పప్పులను, వంట సామగ్రిని పరిశీలించారు. అలాగే బాలికలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. మాట్లాడుతూ.. పిల్లలకు మంచిగా చూసుకుంటే భగవంతుడు మనల్ని మంచిగా చూస్తాడని, విద్యార్థులు బాగా చదువుకుని ఒక లీడర్ ఐతే ఒక అధికారి ఐతే ఎంతో మందికి సేవ చేస్తారు.. కాబట్టి శ్రద్ధగా చదవాలని అన్నారు. విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ, గ్రామీణ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed