పార్లమెంట్‌లో సొంత ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ విమర్శలు.. సోషల్ మీడియాలో ట్రోల్స్

by Mahesh |
పార్లమెంట్‌లో సొంత ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ విమర్శలు.. సోషల్ మీడియాలో ట్రోల్స్
X

దిశ, వెబ్ డెస్క్: రాజ్యాంగాన్ని ఆమోదించుకుని 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన చర్చలో ప్రియాంక గాంధీ పార్లమెంట్‌లో శుక్రవారం తొలి సారి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్డీయే నేతృత్వంలోని బీజేపీ సర్కార్ రాజ్యాంగాన్ని బలహీన పరచేందుకు ప్రయత్నిస్తోందని, న్యాయం, భావప్రకటన, ఐకమత్యానికి రాజ్యాంగం ‘సురక్షా కవచ్‌’లా పనిచేస్తోందన్నారు. అయితే గత పదేళ్లుగా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నామని చెప్పేవాళ్లు దాన్ని ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే బీజేపీపై విమర్శలు చేస్తూ.. హిమాచల్ ప్రదేశ్ గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. హిమాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వం బడా వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ.. రైతులను పట్టించుకోవడ లేదని.. హిమాచల్ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు.

కాగా ఆ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అని మర్చిపోయిన ప్రియాంక గాంధీ ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ వీడియో ని ట్యాగ్ చేస్తూ.. అన్నకు తగ్గ చెల్లి అని పోస్ట్ చేస్తున్నారు. మరికొందరు.. భారీ మెజార్టీతో మరో పప్పును పార్లమెంట్ కు పంపిన వయనాడ్ ప్రజలకు ధన్యవాదాలు అంటూ సెటైర్లు వేస్తున్నారు. ముందు మీ ప్రభుత్వం ఏ రాష్ట్రాల్లో అధికారంలో ఉందో అదైన తెలుసుకుని మాట్లాడు అంటూ మరికొందరు ప్రియాంక గాంధీ పై సెటైర్లు వేస్తుండగా.. ప్రస్తుతం.. సోషల్ మీడియాలో#PriyankaGandivadra వైరల్‌గా మారుతుంది.

Advertisement

Next Story

Most Viewed