వాజేడు ఏస్సై ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మైన మ‌హిళ ఆరెస్టు..

by Kalyani |   ( Updated:2024-12-14 14:48:36.0  )

దిశ‌, ఏటూరునాగారంః- ఈ నెల (డిసెంబ‌ర్) 2 వ తేదిన ములుగు జిల్లా వాజేడు మండ‌ల ఎస్సై రుద్ర‌ర‌పు హ‌రీష్‌ స‌ర్వీస్ రివాల్వ‌ర్ తో కాల్చుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న విషాద సంఘ‌ట‌న తెలిసిందే..అయితే ఈ ఘ‌ట‌న‌లో ఎస్సై రుద్ర‌ర‌పు హ‌రీష్ ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మైన మ‌హిళ‌ను శ‌నివారం రోజు వెంక‌టాపురం సీఐ బండారి కుమార్ అరెస్ట్ చేసి వివ‌రాలను మీడియాకు వెల్ల‌డించారు. సీఐ తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. సూర్య‌పేట జిల్లా చిలుకూరు మండ‌లం దుదియా తండా గ్రామానికి చెందిన బాణోత్‌ అన‌సూర్య @అనూష‌(29) అనే మ‌హిళ హైదారాబాద్ లోని వీబీఐటీ కాలేజీలో అడ్మిన్ స్టాఫ్‌గా వీధులు నిర్వ‌హిస్తుంద‌ని, అయితే గ‌త 7 నెల‌ల క్రితం రాంగ్ ఫోన్ కాల్ ద్వారా వాజేడు ఎస్సై హ‌రీష్ కు ఫోన్ చేసి పరిచ‌యం చేసుకుంద‌ని తెలిపారు.

హ‌రీష్ ఎస్సై కావ‌డంతో అత‌డిని పెళ్లి చేసుకుంటే త‌న జీవితం బావుంటుద‌ని భావించి త‌రుచుగా ఎస్సై హ‌రీష్ కు ఫోన్ చేస్తూ సన్నిహిత్యం పెంచుకున్నట్లు త‌మ విచార‌ణ‌లో తెలింద‌ని తెలిపారు. అయితే ఈ క్ర‌మంలోనే అన‌సూర్య ఎస్సై హ‌రీష్ ను పెళ్లికి ఒప్పించ‌డానికి ప్ర‌య‌త్నం చేసింద‌ని, పెళ్లికి ఒప్పుకోక పోతే మీడియాకు, పోలీసు శాఖ ఉన్నాతాదికారుల‌కు నన్ను శారీరకంగా వాడుకున్నావ‌ని చేబుతానంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరింపుల‌కు పాల్ప‌డుతూ ఒత్తిడి చేసింద‌ని అన్నారు. ఈ క్ర‌మంలో తీవ్ర మ‌నోవేద‌న‌కు గురైన ఎస్సై హ‌రీష్ మండ‌పాక గ్రామ శివారులో గ‌ల ఫేరిడో రిసార్ట్‌లో ఆమె మాట‌ల ద్వారా ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేపింపబ‌డి త‌న స‌ర్వీస్ పిస్టాల్‌తో గ‌ద‌వ క్రింద కాల్చుకుని వాజేడు ఎస్సై రుద్ర‌ర‌పు హ‌రీష్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని సీఐ తెలిపారు. కాగా అన‌సూర్య‌@అనూష అనే మ‌హిళ ప్ర‌మేయం ఈ కేసులో ఉండ‌డం వ‌ల్ల పూర్తి అధారాల‌తో శ‌నివారం రోజున అనూష‌ను అరెస్ట్ చేయ‌డం జ‌రిగింద‌ని, అరెస్టు చేసిన‌ అనూష అనే మ‌హిళ‌ను ఇదే రోజున కోర్టులో హ‌జ‌రు ప‌రుచ‌డం జ‌రుగుతుంద‌ని వెంక‌టాపురం సీఐ బండారి కుమార్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed