- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ సంస్కృతి పై దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలి : ఎమ్మెల్సీ కవిత
దిశ, ఖైరతాబాద్ : తెలంగాణ సంస్కృతి పై జరుగుతున్న దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీలు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ తల్లి పై ప్రేమ లేదు కాబట్టే విగ్రహం రూపాన్ని మార్చారని ఆరోపించారు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ లేకపోతే తెలంగాణ సమాజంలో స్నేహశీలత , సుహృద్భావం ఎలా కనిపిస్తుందని ప్రశ్నించారు. మన అస్తిత్వాన్ని దెబ్బతీసే ధైర్యం ఎవరికీ లేదన్నారు. తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను చూస్తే తెలంగాణ సమాజాన్ని చూసినట్లుంటుందన్నారు. అందరం కలిస్తేనే ఒక అందమైన బతుకమ్మ అవుతుందని, అందరం కలిస్తేనే అందమైన సమాజం అవుతుందన్న సందేశం ఇచ్చేది బతుకమ్మ అని తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో, పునర్నిర్మాణంలో రేవంత్ రెడ్డి ఎక్కడా లేరని ఫైర్ అయ్యారు. ఉద్యమ సమయం నుంచి ఉన్న తెలంగాణ తల్లినే ఆరాధిస్తానని కవిత స్పష్టం చేశారు. ఒక చేతిలో జొన్నకర్ర, మరో చేతిలో బతుకమ్మ ధరించిన తెలంగాణ తల్లి వైభవాన్ని చాటేలా పద్యాలు, కవితలు రచించి పుస్తకాలు విడుదల చేస్తామని తెలిపారు. ఒక చేతిలో జొన్న కర్ర, మరొక చేతిలో బతుకమ్మ ధరించిన తెలంగాణ తల్లి వైభవంపై పద్యాలు, కవితలు రచించి పుస్తకాలు వెలువరిస్తామన్నారు. పిల్లలు వాడే నోట్ బుక్స్, రైటింగ్ ప్యాడ్స్ అన్నింటిపై తెలంగాణ తల్లిని ముద్రించి పిల్లలకు ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. తెలంగాణ తల్లికి ఆరాధానతో కార్యక్రమం మొదలుపెట్టే సంప్రదాయాన్ని ఇకముందూ కొనసాగిస్తామని తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహాలను గ్రామ గ్రామానా ప్రతిష్ఠించే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. బతుకమ్మ అగ్రవర్ణాల పండుగ అన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని తెలంగాణ జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.