- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిన్న వయసులో పెళ్లి చేస్తే జైలు శిక్షే
దిశ, బోథ్ : చిన్న వయసులో పెళ్లి చేస్తే జైలు శిక్ష తప్పదని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల కేంద్రంలోని పరిచయ గార్డెన్ లో బోథ్ నియోజకవర్గ లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి సీతక్క చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం బాల్య వివాహాలను తగ్గించాలన్న ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం అందిస్తుందన్నారు. చిన్న వయసులో పెళ్లి చేసినట్లయితే మానసికంగా, శారీరకంగా ఎదగకుండా, సంసారంలో చిక్కులను, అనారోగ్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. 18 సంవత్సరాలలోపు పిల్లలకు పెళ్లి చేస్తే జైలు శిక్ష తప్పదని అన్నారు.
మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, అధికారులు సైతం ఇందుకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. స్థానిక శాసనసభ్యుడు అనిల్ జాదవ్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజలకు అండగా నిలవడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో నుండి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. పేదలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విట్టల్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలం, ఆర్డీఓ వినోద్ కుమార్, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.