Kiran Abbavaram: పారితోషికం భారీగా పెంచేసిన కిరణ్ అబ్బవరం.. ఎన్ని కోట్లు అంటే..!

by Prasanna |
Kiran Abbavaram: పారితోషికం భారీగా పెంచేసిన కిరణ్ అబ్బవరం.. ఎన్ని కోట్లు అంటే..!
X

దిశ, వెబ్ డెస్క్ : షార్ట్ ఫిలిమ్స్ తో మూవీస్ స్టార్ట్ చేసిన హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram).. ‘రాజావారు రాణిగారు’ (Raja Vaaru Rani Gaaru) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ (SR Kalyanamandapam) తో మంచి విజయం సాధించాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలేవీ హిట్ కాకాపోవడంతో

గ్యాప్ తీసుకుని ‘క’ (KA) మూవీ చేశాడు. అది సూపర్ హిట్ అవ్వడంతో ఈ హీరో రూ.50 కోట్ల క్లబ్ లో చేరాడు. త్వరలో ‘దిల్ రుబా’ అనే కొత్త సినిమాతో కిరణ్ అబ్బవరం ఆడియెన్స్ ముందుకు రానున్నాడు. నిజానికి, ‘క’ మూవీ కంటే ముందు ‘దిల్ రుబా’ రావాలి. దాని షూటింగ్ ముందే కంప్లీట్ అయ్యింది. ‘క’మూవీ కంటెంట్ బాగా వచ్చిందనే కాన్ఫిడెన్స్ తో.. ఆ మూవీని ముందు విడుదల చేశాడు.

గతంతో పోలిస్తే రెమ్యునరేషన్ రూ.2 కోట్లు పెంచేశాడు. ‘క’ మూవీకి ముందు వరకు రూ.3, రూ.4 కోట్లు పారితోషికం తీసుకునే కిరణ్ అబ్బవరం. ఇప్పుడు రూ.6 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. అంతేకాకుండా, ప్రొడక్షన్ కూడా అతని టీం చూసుకుంటుందని చెప్పాడు. ఏదైనా విజయం సాధించినప్పుడు క్యాష్ చేసుకోవడం.. హీరోలకు అలవాటే.. కిరణ్ సబ్బవరం కూడా అదే ఫాలో అవుతున్నాడని సినీ వర్గాల నుంచి సమాచారం.

Advertisement

Next Story

Most Viewed