- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీటి తొట్టిలో పడి మహిళ మృతి
దిశ, బీబీపేట: నీటి తొట్టి పైకెక్కి కాళ్లు చేతులు కడుక్కుంటుండగా ప్రమాదవశాత్తు అందులో జారిపడి మహిళ ఒకరు మృతి చెందిన సంఘటన భిక్కనూరు సర్కిల్ పరిధిలోని బీబీపేట మండలం తుజాల్ పూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పులి రాములమ్మ(53) బర్రెను తీసుకొని ఎల్లమ్మ టెంపుల్ సమీపంలో ఉన్న వారి వ్యవసాయ బావి వద్దకు మేపేందుకు తీసుకెళ్లింది. అయితే పొద్దుననగా వెళ్లిన ఆమె సాయంత్రం వరకు కూడా ఇంటికి తిరిగి రాకపోవడంతో, ఆమె కోసం భర్త సత్తయ్య వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. వ్యవసాయ భూమిలో ఉన్న నీటి తొట్టిలో రాములమ్మ మృతదేహం తేలియాడుతూ కనిపించడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. వెంటనే కుమారులు ప్రవీణ్, ప్రసాద్ లకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. వెంటనే కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ ప్రభాకర్ నేతృత్వంలోని పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.