- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
దిశ,నిజాంసాగర్: బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్ మండలం మైలారం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీపెద్దమ్మ తల్లి తీరా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో శుక్రవారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి,రాష్ట్ర ఆగ్రో పరిశ్రమల చైర్మన్ కాసుల బాలరాజ్ పాల్గొన్నారు. నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో గ్రామ దేవతల ఆలయాలు నిర్మించుకోవడం ఎంతో శుభసూచకమని ఆయన వెల్లడించారు. గ్రామ దేవతలు ఆలయాలు గ్రామంలో ఉంటే ఆ గ్రామానికి ఇలాంటి కీడు జరగదని ఆ గ్రామం పచ్చని పంటలతో ప్రజలు ఆయురారోగ్యాలతో ఉంటారని ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేశారు. బాన్సువాడ నియోజకవర్గం లో మతాలకు అతీతంగా అందరూ ఆలయాలు, మసీదులు, చర్చిలు నిర్మించుకుంటున్నారని ఈ సందర్భంగా పోచారం వెల్లడించారు. మైలారం గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం నిర్మాణానికి గ్రామస్తులు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని మైలారం గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెరిక శ్రీనివాస్. గ్రామ పెద్దలు,కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.