అయ్యో బాబోయ్ తాడ్వాయి పోలీస్ స్టేషనా..!

by Kalyani |
అయ్యో బాబోయ్ తాడ్వాయి పోలీస్ స్టేషనా..!
X

దిశ, తాడ్వాయి : అయ్యో బాబోయ్ తాడ్వాయి పోలీస్ స్టేషనా..బదిలీపై పోలీస్ స్టేషన్ కు రావాలంటే మొహం చాటేస్తున్న పలువురు ఎస్సైలు..బదిలీ పై వస్తారని ఒకరి తర్వాత ఒకరి పేర్లు వినిపించిన ఇప్పడికి ఎస్సై కుర్చీ ఖాళీగానే ఉంది. తాడ్వాయి మండలం పోలీస్ స్టేషన్ లో రెండు సంవత్సరాల పాటు విధులు నిర్వహించిన ఎస్సై ఆంజనేయులు బదిలీపై గాంధారికి వెళ్ళారు. దీంతో ఆయన బదిలీ పై వెళ్లి రెండు వారాలు అవుతున్న ఇప్పటికి నూతన ఎస్సై రాకపోవడంతో శాంతి భద్రతలు సన్నగిల్లే ప్రమాదం లేకపోలేదు. మొదటగా శంకరం పేట్ ఠాణ ఎస్సై బదిలీపై వస్తారని అధికారులు తెలిపారు.

దీంతో ఎస్సై వస్తారనుకున్నరు కానీ తీరా చేగుంట ఠాణకు మొగ్గుచూపారు. దీంతో మరో ఎస్సై వస్తారని ప్రచారం జరగడంతో ఆయన కూడా ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపకపోవడంతో మరో ఎస్సై సిరిసిల్ల జిల్లా నుంచి ఇక్కడికి బదిలీపై వస్తారని ప్రచారం జరుగుతున్న ఇంకా పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయకపోవడంతో ఈయన కూడా తాడ్వాయి రావడం అనుమానంగానే ఉందనే భావన మండల ప్రజలల్లో కలుగుతుంది. దీంతో ముగ్గురు ఎస్సైల పేర్లు వినిపించిన ఇప్పటివరకు రాకపోవడంతో ఎస్సై కుర్చీ ఖాళీగా మిగిలిపోయింది. మండలానికి ఎస్సైగా ఏ అధికారి వచ్చి శాంతి భద్రతలను పర్యవేక్షస్తారో అని ప్రస్తుతం తాడ్వాయి పోలీస్ స్టేషన్ పై మండల ప్రజలల్లో చర్చ మొదలైంది. ఉన్నత అధికారులు చోరువతో అయిన తాడ్వాయి నూతన ఎస్సైని రప్పించి మండల ప్రజల కోరిక నెరవేరుస్తారో లేదో వేచి చూడాల్సిందే...

Advertisement

Next Story

Most Viewed