- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలీసాగర్ గేట్లు ఎత్తనున్న అధికారులు..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని అలీ సాగర్ ప్రాజెక్ట్ గేట్లను సోమవారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో అధికారులు ఎత్తనున్నారు. ఎగువ పరివాహక ప్రాంతంలో అతిభారీ వర్ష సూచన కారణంగా ప్రాజెక్ట్ వరద గేట్లను ఈరోజు ఉదయం 10-30 కు ఎత్తి , వాగులోకి వదలడం జరుగుతోందని బోధన్ అలీ సాగర్ ప్రాజెక్టు ఇరిగేషన్ డివిజన్ నెంబర్ 1 ఈఈ తెలిపారు. రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు తగిన విధంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు.
వాగు పరివాహక ప్రాంతం లోకి పశువులు గాని ,గొర్రెలు మొదలగునవి వెళ్లకుండా అలాగే చేపలు పట్టేవారు,గొర్రె కాపరులు, రైతులు వెళ్లకుండా అప్రమత్తం గా ఉండవలెనని తెలిపారు. అలీ సాగర్ ప్రాజెక్టు దిగువ పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయవలసినదిగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా మిత్రులకు పోలీస్,రెవెన్యూ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.