అధికారులు సమన్వయంతో పనిచేయాలి

by Sridhar Babu |
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
X

దిశ, కామారెడ్డి : జిల్లాలో చక్కటి అధికారుల బృందం ఉందని, అందరూ సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో కృషి చేస్తున్నారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కితాబిచ్చారు. శనివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ నూతన డైరీ ని అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఆర్డీఓలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికారులతో పలు అంశాలను ప్రస్తావిస్తూ జిల్లాలో శాసనసభ ఎన్నికలను సజావుగా నిర్వహించామని, ఇదే స్పూర్తితో రాబోయే పార్లమెంటు ఎన్నికలలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. ఈ నెల 8 న ఓటరు తుది జాబితా ప్రకటించనున్నందున ఓటరు నమోదు, మార్పులు, చేర్పులకై వచ్చిన క్లెయిమ్స్ అన్నింటిని 7 లోగా పూర్తిగా పరిష్కరించి తప్పులులేని ఓటరు జాబితా సిద్ధం చేయాలన్నారు.

ఈ పార్లమెంటు ఎన్నికలకు నోడల్ అధికారులను మార్చామని, వారంతా ఎన్నికల నిర్వహణపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఓటరుగా ఉన్న వారు ఓటు అవకాశాన్ని కోల్పోకుండా ఎంప్లాయిస్ డేటా బేస్ లో తప్పనిసరిగా ఎపిక్ వివరాలు నమోదు చేయాలని, వివరాలను వెంటనే అందించాలని అధికారులకు సూచించారు. ఓటరు తుది జాబితా అనంతరం భారత ఎన్నికల కమిషన్ ఎప్పుడైనా సమీక్షించవచ్చని, అధికారులు సంసిద్దులుగా ఉండాలన్నారు. జిల్లాలో 3, 4 మండలాల్లో ధరణిలో పెండింగ్ ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక దృష్టిసారించడం వల్ల ఎంతో పురోగతి సాధించామన్నారు. విద్యార్థులకు ఆదాయ, కుల ద్రువీకర జారీకై ప్రత్యేక డ్రైవ్ చేపట్టేలా చూడాలని ఆర్డీఓలకు సూచించారు. ప్రతి శాఖ చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రగతి కనిపించాలని, పక్కా ప్రణాళికతో లక్ష్య సాధనకు కృషిచేయాలన్నారు.

నియోజక వర్గ అభివృద్ధి నిధుల కింద అభివృద్ధి పనులను గుర్తించి చేపట్టడంతో పాటు వచ్చే వేసవి దృష్ట్యా మంచి నీటి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్ తోపాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో మరమతులు, నిర్వహణ కోసం నియోజక వర్గ ప్రత్యేక నిధులను వినియోగించాలని కలెక్టర్ అధికారులకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయబోయే మరో రెండు పథకాల అమలుపై అధికారులు సమగ్ర వివరాలతో సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ లు శ్రీనివాస్ రెడ్డి, మన్నే ప్రభాకర్, భుజంగం, సీపీఓ రాజారామ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి దయానంద్, భూగర్భ జల శాఖ ఏడీ సతీష్ యాదవ్, పశు సంకవర్ధక శాఖాధికారి సింహరావు, మత్స్య శాఖ సహాయ సంచాలకులు వరదా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed