- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆక్రమించిన ప్రభుత్వ నిజాంసాగర్ స్థలాలను ఖాళీ చేయాలి
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని కోటార్మూర్ 63వ జాతీయ రహదారి పక్కన ఉన్న నిజాంసాగర్ కెనాల్ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన ఐదుగురికి ఎవిక్షన్ నోటీసులను జారి చేసినట్లు తహసిల్దార్ గజానన్ తెలిపారు. కోటార్మూర్ లోని 63వ జాతీయ రహదారి పక్కన డిస్ట్రిబ్యూటరీ నెంబర్ 82/1/2లో నీటిపారుదల శాఖకు చెందిన నిజాంసాగర్ కెనాల్ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన సర్వే నంబర్ల 22/1, 40/1, 40/2 పట్టాదారులైన ఐదుగురికి ఈ నెల 16 న నోటీసులు జారీ చేసినట్లు ఆలస్యంగా ఆర్మూర్ తాసిల్దార్ గజనాన్ తెలిపారు. నిజాంసాగర్ కెనాల్ స్థలాన్ని ఆక్రమించి అక్రమ పద్ధతిలో ఎలాంటి అనుమతులు లేకుండా షెడ్లను ఏర్పాటు చేశారు. దీంతో దిశ దిన ప్రతికలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారన్న కథనం ప్రచురించారు. దీనిపై ఆర్మూర్ తాసిల్దార్ గజనాన్, మున్సిపల్ కమిషనర్ రాజు లు స్పందించారు. ఈ కాల్వ స్థలాన్ని బొగడమీది పెద్ద బాజన్న 1 ఎకరం 36 గుంటలు, కొట్టాల గంగాధర్, గుండు సాయన్నలు కలిపి 350 గజాలు, 160 గజాలు, 160 గజాలు, 120 గజాలు వారి ప్లాట్ లలో ఆక్రమించినట్లు తాసిల్దార్ గజనాన్ తెలిపారు. చవిటి గిరిధర్ 111 గజాలు, మద్దినేని వెంకటేశ్వరరావు మూడు గుంటల స్థలాన్ని ఆక్రమించినట్లు నోటీసులో పేర్కొన్నారు. గత నెల 7న వీరికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. నిజాంసాగర్ కాల్వకు చెందిన నీటిపారుదల శాఖకు చెందిన ఆక్రమించిన స్థలాలను ఖాళీ చేయాలని ఎవిక్షన్ నోటీసులు ఐదుగురికి అందజేసినట్లు వివరించారు. ఈ నోటీను ఇచ్చిన తర్వాత గడువులోగా ఖాళీ చేయనట్లయితే సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో..నిజాంసాగర్ కాలువ స్థలం ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న వాటిని ఖాళీ చేయించి స్వాధీనం చేసుకుంటామని ఆర్మూర్ తాసిల్దార్ గజనాన్ పేర్కొన్నారు. మున్సిపల్ ద్వారా కూడా ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తున్న సదరు వ్యక్తులపై త్వరలోనే కొరడా జులుపిస్తామని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు.