నలంద పాఠశాలకు నోటీస్ జారీ..

by Sumithra |
నలంద పాఠశాలకు నోటీస్ జారీ..
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల నలంద పాఠశాలకు శనివారం నోటీసులు జారీ చేసినట్టు ఎంసీఓ పింజ రాజ గంగారం తెలిపారు. పాఠశాలలో పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని పలువిద్యార్థి సంఘాలు ఫిర్యాదు ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ మేరకు మామిడిపల్లి ఉన్నత పాఠశాల హెచ్ఎం, సీఆర్పీని పంపించి నలంద పాఠశాలలో పాఠ్యపుస్తకాలు ఉన్న గదిని సీజ్ చేసి ఆ పాఠశాలకు నోటీస్ జారీ చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నందుకు వివరణ కోరుతూ షోకాజు నోటీస్ జారీ చేసినట్లు చెప్పారు. ఏ ప్రైవేట్ పాఠశాలలైన పాఠ్యపుస్తకాల అమ్మకాలు జరిపినట్లయితే ఆ పాఠశాలలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎంఈఓ హెచ్చరించారు.

Advertisement

Next Story