డీసీవో పై విచారణ చేయాలని ప్రభుత్వానికి నిజామాబాద్ డిసిసిబి తీర్మానం

by Kalyani |
డీసీవో పై విచారణ చేయాలని ప్రభుత్వానికి నిజామాబాద్ డిసిసిబి తీర్మానం
X

దిశ, ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా మాజీ సహకార అధికారి సింహాచలం పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పాలకవర్గం తీర్మానం చేసింది. సోమవారం నిజామాబాద్ డిసిసిబి లో చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అధ్యక్షతన మహాజనసభ జరిగింది. ఈ సమాజంలో పలు సొసైటీల డైరెక్టర్లు గత మూడు సంవత్సరాలలో నాలుగు సీజన్లకు సంబంధించిన ధాన్యం కొనుగోలు విషయంలో సొసైటీలకు రావాల్సిన కమిషన్ ఇప్పటికి ఖాతాలో జమ కాకపోవడంపై సమావేశంలో చర్చించారు. గత ఏడాది వరకు నిజామాబాద్ డీసీవో గా పని చేసిన సింహాచలం సంబంధిత కమిషన్ సొసైటీల ఖాతాలకు మళ్లించకుండా తన డీసీవో ఖాతాలోకి జమ చేసుకొని చెల్లింపులు జరపలేదని ఒక వేళ చెక్కులు ఇచ్చిన విత్ డ్రా కొరకు కొర్రీ విధించారని సొసైటీల చైర్మన్లు వాపోయారు.

ఈ విషయంలో సొసైటీలు ధాన్యం కొనుగోలుకు సంబంధించిన కమిషన్ రాక గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక ఇబ్బందులు గురయ్యాయని తెలిపారు. ఈ విషయంలో గతంలో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని దానిపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపి అందుకు కారణమైన డీసీవో పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సహకార సంఘాలకు కేంద్ర ప్రభుత్వం రాసిన మూడు శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నాలుగు శాతం నిధులు నిర్వహణ కోసం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా చెందిన సొసైటీల డైరెక్టర్లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed