- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎర్రజొన్న కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకూడదు..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఎర్రజొన్న కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్కెట్ రేటుకు అనుగుణంగా ధరను చెల్లిస్తూ పంటను సేకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సీడ్ కంపెనీల ప్రతినిధులకు సూచించారు. ఎర్రజొన్న దిగుబడులు చేతికందుతున్న నేపథ్యంలో, కలెక్టర్ సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్లో విత్తన వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. రైతులతో కుదుర్చుకున్న బైబ్యాక్ ఒప్పందానికి కట్టుబడి కొనుగోళ్లు జరగాలన్నారు.
ఎర్రజొన్న సాగుకు అవసరమైన విత్తనాల సరఫరా, రైతులతో ఒప్పందం కుదుర్చుకునే విధానం, విత్తనాల వెరైటీలు తదితర అంశాల గురించి వ్యాపారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల నుండి సేకరించిన ఎర్రజొన్న పంటను ఢిల్లీ, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తామని, అక్కడ ఎర్రజొన్నను పశువులకు దాణాగా వినియోగిస్తారని సీడ్ కంపెనీల ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. గతేడాది సాగు చేసిన ఎర్రజొన్న పంటను పలువురు రైతులు కోల్డ్ స్టోరేజ్ లలో నిలువ చేసుకుని ఈ ఏడాది విక్రయించారని తెలిపారు.
అయినప్పటికీ, ఈసారి అత్యధిక మంది మొక్కజొన్న పంటవైపు మొగ్గు చూపడంతో ఎర్రజొన్న సాగు విస్తీర్ణం తగ్గిందని అన్నారు. ఫలితంగా ప్రస్తుతం మార్కెట్లో ఎర్రజొన్న పంటకు ఆశించిన రీతిలోనే మంచి డిమాండ్ ఉందని తెలిపారు. రైతులతో కుదుర్చుకున్న ఒప్పందానికి మించి ఎర్రజొన్నకు ఎక్కువ మొత్తంలో ధరపలుకుతోందని అన్నారు. ఎలాంటి సమస్యలకు తావులేకుండా కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, విత్తన కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.