- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజాం సాగర్ 8 గేట్లు ఓపెన్.. 82 వేల క్యూసెక్కుల నీటి విడుదల
దిశ, నిజాంసాగర్ : ఎటు చూసినా వర్షం, ఎక్కడ చూసినా వరదలు ఇది ప్రస్తుత తెలంగాణ పరిస్థితి. భారీగా కురుస్తున్న వర్షాలకు నదులు, ప్రాజెక్టులు ఎక్కడికక్కడ నిండిపోతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో దిగువ ప్రాంతాల ప్రాజెక్టులు జలమయమవుతున్నాయి. అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రాజెక్టులను పర్యవేక్షిస్తూ అప్రమత్తమవుతున్నారు.
ఈ క్రమంలోనే నిజాం సాగర్ ప్రాజెక్టు ఎనిమిది గేట్లను ఎత్తి సుమారు 82,000 క్యూసెక్కుల నీటిని మంజీరలోకి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు ఏఈ శివప్రసాద్ మాట్లాడుతూ సింగూరు ప్రాజెక్టుతో పాటు ప్రాజెక్ట్ క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 58 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుందన్నారు. దానికి అనుగుణంగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలానికి చెందిన వ్యవసాయ పొలాలు నిజాంసాగర్ ప్రాజెక్ట్ లో ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్నారు.
ముందు జాగ్రత్త చర్యగా ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజాల సురేందర్, నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడి ప్రాజెక్టు నీటి మట్టాన్ని స్థిరంగా కొనసాగించాలని తెలిపారు. ఎక్కువ మొత్తంలో నీటిని నిల్వ చేస్తే నాగిరెడ్డిపేట మండలంలోని వ్యవసాయ పొలాలు ముంపునకు గురయ్యే అవకాశముందని ప్రాజెక్టు అధికారులకు తెలిపారు. దానికి అనుగుణంగా ప్రాజెక్టులోకి యాభై ఎనిమిది వేల క్యూసెక్కుల వరద నీరు వస్తున్నా దిగువకు ఎనభై రెండు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 .00 అడుగులు కాగా ప్రస్తుతం 1404.76 అడుగులతో 16.877 టీఎంసీల నీటి నిల్వతో కొనసాగుతోందని తెలిపారు.