BRS: పార్టీలో చేరిన తర్వాత పదవులు నిల్

by Prasanna |   ( Updated:2023-06-21 03:37:25.0  )
BRS: పార్టీలో చేరిన తర్వాత పదవులు నిల్
X

దిశ, నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్సీ షాక్ ఇవ్వనున్నారా? అనే వార్త హల్ చల్ చేస్తుంది. ఆయన కారు ఎక్కినప్పటి నుంచి ఇప్పటివరకు పార్టీలో తగిన ప్రాధాన్యం దక్కలేదు. ఇటీవల సీఎం కేసీఆర్ సిట్టింగ్ లకే ఎమ్మెల్యే టికెట్లు ఖరారు చేయగా.. ఇక టికెట్ రాదనుకుని గులాబీపార్టీ గుడ్ బై చెప్పాలనుకుంటున్నట్టు జోరుగా చర్చ నడుస్తుంది. రాజకీయ గురువుతో తను బీఆర్ఎస్ లో చేరినప్పనుంచి ఇప్పటిదాకా ఎలాంటి పార్టీ, అధికార పదవులు దక్కకపోవడంతోనే ఆ నేతకు నిరాశకు కారణమని తెలుస్తుంది. ఎమ్మెల్సీ గా, పార్టీ నేతగా అనుభవం ఉన్నా జిల్లా అధ్యక్ష పదవి, చేరినప్పుడు ఇస్తామన్న ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోగా కొంతకాలంగా ఆయన దూరంగా ఉంటున్నారనే టాక్. అధికారిక కార్యక్రమాలు, ప్రజావ్యతిరేక విధానాలపై చేపట్టిన పార్టీ చేపట్టిన నిరసనల్లోనూ ఆయన పాల్గొనలేదు. కనీసం కార్పొరేషన్ పదవులకు తన పేరు పరిగణలోకి తీసుకోకపోగా..ఇక తన దారేదో తను చూసుకునేందుకు సిద్ధమయ్యారని అనుచరులు చెబుతున్నారు. తన ప్రాంతంలో పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యే చాన్స్ లేకపోవడంతో పక్క పార్టీలోకి జంప్ అయ్యేందుకు చూస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఆయనతో టచ్ లోకి వెళ్లాడని పార్టీలోనూ చర్చ నడుస్తుంది. గడిచిన ఆరేళ్లలో ఎలాంటి ప్రాధాన్యత లేకపోగా గురుశిష్యులు బీఆర్ఎస్ తో అంటిముట్టనట్లుగానే ఉంటున్నారు. ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ధీమాతో కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో రాష్ట్రంలోనూ ఆ పార్టీకి జోష్ పెరిగినది తెలిసిందే. త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలిసింది. అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా ఎన్నికల నాటికి టికెట్ హామీ ఇస్తే..చేరుతాననే సంకేతాలను రేవంత్ రెడ్డికి పంపించినట్లు ప్రచారంలో ఉంది. రేవంత్ రెడ్డితో సాన్నిహిత్యం ఉన్న నేతల ద్వారా టికెట్ కోసం ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఈసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాలని యోచిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న మరో ఇద్దరి కంటే తనకే అక్కడ పట్టు ఉందని చెబుతూ తనకు గల ఆర్థిక, సామాజిక సమీకరణలు బలాన్ని రేవంత్ రెడ్డి ముందు ఉంచినట్లు సమాచారం. ఇప్పటికే రేవంత్ రెడ్డి టీం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలం, లీడర్ల కెపాసిటిపై ఒక దఫా సర్వే నిర్వహించి గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామని ప్రకటించినది తెలిసిందే. ఇక టికెట్ ఇస్తే కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తానని చెబుతూ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Also Read..

సారుకు ఫికర్! పార్టీ పరిస్థితులపై గులాబీ బాస్‌కు టెన్షన్

Advertisement

Next Story

Most Viewed