- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీవన్ రెడ్డివి పిరికిపంద చర్యలు : ఎంపీ అర్వింద్
దిశ ప్రతినిధి, నిజామాబాద్: ప్రజాస్వామ్యయుతంగా నిష్పక్షపాతంగా వార్తలు రాస్తున్న విలేకరులపై దాడులు చేస్తున్న టీఆర్ఎస్ గుండాల పై హత్య యత్నం కేసు నమోదు చేయాలని ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. సోమవారం దాడిలో గాయపడి చికిత్సపొందుతున్న సాక్షి దినపత్రిక విలేకరి పోశెట్టి ని ఆసుపత్రికి వెళ్లి ఎంపీ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జడ్పీ చైర్మన్ విట్టల్ రావు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మధ్య ఉన్న విభేదాలు అధిష్టానం వద్ద తేల్చుకోవాలని అన్నారు. మాక్లూర్ మండలం లో పనిచేస్తున్న విలేకరి పోశెట్టి నిజాలు రాసినందుకు దాడి చేయడం పిరికిపంద చర్య అన్నారు.
ఇప్పటికే సదరు ఎమ్మెల్యే పై హత్య కేసులో ఆరోపణలు ఉన్నాయని అన్నారు. భూ మాఫియా, దాడులు తదితర ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యే అనుచరులు జర్నలిస్టులపై దాడులకు దిగడం సిగ్గుచేటన్నారు. జర్నలిస్టుల ఆందోళనకు ఎంపీ సంఘీభావం తెలిపారు. దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసు నమోదు చేయాలని, చట్ట ప్రకారం నిందితులను శిక్షించాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బస్వా లక్ష్మీ నర్సయ్య, వినయ్ రెడ్డి తదితరులు ఉన్నారు.