- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గెలుస్తున్నాం... ఎంపీ అరవింద్ ధర్మపురి
దిశ, నవీపేట్ : నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మాత్రమే పోటీ ఉంటుందని, బూతుస్థాయి నుండి జిల్లాస్థాయి నాయకులు కృషి చేస్తే అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధిస్తామని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి అన్నారు. మండల కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హల్ లో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీ అరవింద్ మాట్లాడుతూ మే 30 నుండి జూన్ 30 వరకు నిర్వహిస్తున్న మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో బూత్ స్థాయి నుండి జిల్లా స్థాయి నాయకులు అందరూ కలిసికట్టుగా పని చేయాలని కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు.
నిజామాబాద్ జిల్లాలో బీజేపీ బీఆర్ఎస్ మధ్య మాత్రమే పోటీ ఉంటుందని, కాంగ్రెస్ కు థర్డ్ పొజిషన్ మాత్రమే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కంట్రోల్ లో ఉందని, కొన్ని మీడియా సంస్థలు బీఆర్ఎస్ చేతిలో కీలుబొమ్మలుగా మారి రాజకీయం చేస్తున్నాయని, వీటన్నింటినీ గమనిస్తున్నామని అన్నారు. గ్రామ, మండల, జిల్లా భాద్యులు పార్టీ కోసం పనిచేయాలని, దేశ హితం కోసం మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ప్రచారం చేస్తూ గెలుపుకు కృషి చెయ్యాలని సూచించారు.
దేశ ద్రోహుల అడ్డాగా నిజామాబాద్, బోధన్..
పీఎఫ్ఐ, దొంగ పాస్ పోర్ట్, రోహింగ్యాలకు, దేశ ద్రోహులకు అడ్డాగా బోధన్, నిజామాబాద్ లు మారాయని, బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఉన్నందునే బోధన్ లో దేశ ద్రోహులకు అడ్డాగా మారిందని, హిందువుల పై దాడులు, శివాజీ విగ్రహాల పై రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు. జిల్లా మంత్రి , సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత దేశ ద్రోహులకు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఇతర దేశ ప్రధానులు కాళ్లు మొక్కుతున్నారని, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల అధిపతులు ది బాస్ అని కొనియాడుతున్నాయని తెలిపారు.
అనంతరం బీజేపీ బోధన్ నియోజకవర్గ నాయకులు వడ్డీ మోహన్ రెడ్డి రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టగా, మెడపాటి ప్రకాష్ రెడ్డి బలపరిచారు. బీజేపీ సీనియర్ నాయకులు, జిల్లా ఇంచార్జి మీసాల చంద్రయ్య, పార్లమెంట్ ప్రబారి, యెండల లక్ష్మీ నారాయణ, జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనారాయణ, దన్పాల్ సూర్యనారాయణ, దినేష్ , వినయ్ రెడ్డి, న్యాలం రాజు, రెంజల్ జడ్పీటీసీ మ్యాక విజయ సంతోష్, ఎంపీపీ రజనీ కిషోర్, ఎంపీటీసీ రాధ, మండల బీజేపీ నాయకులు ఆదినాథ్, రామ కృష్ణ, ఆనంద్, రాము, రమణ రావు, రాజేందర్ గౌడ్, భాను గౌడ్, జిల్లా నాయకులు, వివిధ మండల నాయకులు పాల్గొన్నారు.