- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chandrababu Arrest: బోధన్‌లో టీడీపీ నేతల దీక్షకు ఎమ్మెల్సీ కవిత సంఘీభావం
దిశ, వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఆయనకు రాజకీయ నాయకుల నుంచి మద్దుతు పెరుగుతోంది. ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్‌ను వివిధ పార్టీల నాయకులు ఖండించారు. తెలంగాణలోనూ దాదాపు అన్ని పార్టీలు ఖండించాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు లాంటి వ్యక్తులు సైతం చంద్రబాబు అరెస్ట్ పట్ల స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ సరికాదని ఖండించారు.
ఇప్పుడు తాజాగా ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఆమె పర్యటించారు. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ స్థానిక తెలుగుదేశం నాయకులు, చంద్రబాబు అభిమానులు నిరసన దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ శిబిరానికి ఎమ్మెల్సీ కవిత వెళ్లారు. దీక్ష చేస్తున్న నేతలకు ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్ సంఘీభావం తెలిపారు. 73 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబును అరెస్ట్ చేయడం సరికాదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఇది ఏపీలో జరుగుతున్న రెండు పార్టీల వ్యవహారమని ఆమె వ్యాఖ్యానించారు.