రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్యే విమర్శలు...

by Naveena |
రాష్ట్ర ప్రభుత్వంపై  ఎమ్మెల్యే విమర్శలు...
X

దిశ ,ఆర్మూర్ : రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తన వ్యక్తిగత ట్విట్టర్ వేదికగా గురువారం పలు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాల విద్య వ్యవస్థను తీసివేయడానికి కుట్ర పన్నుతోందని, అన్నంలో పురుగులు వస్తున్నాయని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. గురుకులాల్లో సరైన వసతులు లేక, చదువు లేక త్రీవ ఇబ్బందులు పడుతున్న పేద,మధ్యతరగతి విద్యార్థులకు చదువు దూరం చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ట్విట్టర్ లో పైడి రాకేష్ రెడ్డి విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed