మంత్రి Harish Rao పర్యటనను అడ్డుకున్న బీజేపీ నాయకులను హెచ్చరించిన: ఎమ్మెల్యే షిండే

by samatah |   ( Updated:2022-12-04 08:58:02.0  )
మంత్రి Harish Rao పర్యటనను అడ్డుకున్న బీజేపీ నాయకులను హెచ్చరించిన: ఎమ్మెల్యే షిండే
X

దిశ, పిట్లం: పిట్లం మండలంలో అభివృద్ధి పనులను ఓర్వలేకనే బీజేపీ నాయకులు ఆర్థిక శాఖ మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుని కాన్వాయ్ ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఆదివారం నాడు మండల పరిషత్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన తీవ్రంగా ఖండించారు. శనివారం నాడు మంత్రి హరీష్ రావు పిట్లం పర్యటనలో భాగంగా 30 పడకల ఆసుపత్రికి 10 కోట్ల 70 లక్షల రూపాయలు మంజూరు చేసి పిట్లం పరిసర ప్రాంతాల ప్రజల చిరకాల కోరికను నెరవేరినందుకు అని ప్రశ్నించారు. ప్రజల వద్దకు ప్రార్థన లెక్క మండలాలను ఏర్పాటు చేస్తే డోమిలి మండలంలో కూడా నిరసన చేయడం సిగ్గుచేటని ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని బీజేపీ నాయకులకు హెచ్చరించారు. బాన్సువాడ కామారెడ్డి ఎల్లారెడ్డి వెళ్లకుండా కిడ్నీ వ్యాధిగ్రస్తుల కొరకు బిచ్కుంద మండలం కేంద్రంలో డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించిన సందర్భంగా ప్రజలు మంత్రికి ధన్యవాదాలు తెలిపినట్లు ఎమ్మెల్యే అన్నారు.

డోగ్లి మండలంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా కోటి రూపాయలతో నిర్మిస్తున్న పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారని అన్నారు. చిల్లరికి గ్రామంలో పీహెచ్సీ, బిచ్కుంద మండల కేంద్రంలోని ఆసుపత్రిలో పోస్టుమార్టంకి పరికరాలను గదిని మంజూరు చేసినట్లు అన్నారు. నిరసన చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు చిల్లర పనులు మానుకొని అభివృద్ధికి సహకరిస్తేనే జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తుందని పేర్కొన్నారు. జాతీయ పార్టీగా ఉన్న బీజెపి పార్టీ కక్ష సాధింపు చర్యలు చేయడమే సిగ్గుచేటని ఎదవ చేశారు బీజేపీ నాయకులు ఎందుకు నిరసన చేశారో పత్రిక పరంగా చెప్పాలని అన్నారు. పిట్లం నుండి మద్దెల చెరువు వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి మూడు కిలోమీటర్ల వరకు ఏడు కోట్లు మంజూరు చేయాలని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఇలాంటి పనులు మానుకోవాలని ఎమ్మెల్యే హన్మంత్ షిండే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసీ శ్రీనివాస్ రెడ్డి,ఎంపీపీ కవిత విజయ్, వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, సర్పంచ్ విజయ శ్రీనివాస్ రెడ్డి,రమేష్, సొసైటీ చైర్మన్ శపథం రెడ్డి, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వాసవి రమేష్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.


Also Read....

మహబూబ్ నగర్ చేరుకున్న KCR.. సీఎం స్పీచ్‌పై ఉత్కంఠ x

Advertisement

Next Story

Most Viewed