తెలంగాణ ఎన్నికల వేళ సంచలన పరిణామం.. ఎమ్మెల్యే అభ్యర్థి ఆత్మహత్య

by Mahesh |   ( Updated:2023-11-19 04:07:57.0  )
తెలంగాణ ఎన్నికల వేళ సంచలన పరిణామం.. ఎమ్మెల్యే అభ్యర్థి ఆత్మహత్య
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఎన్నికల వేళ కలకలం రేపింది. సాయి నగర్‌లో ఇంట్లో ఉరి వేసుకుని కన్నయ్య గౌడ్ (35 ‌) ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం ఉదయం వెలుగు చూసింది. యమగంటి కన్నయ్య గౌడ్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇటీవల నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగా అతనికి రోటి మేకర్ ఎన్నికల సింబల్‌గా వచ్చినట్టు తెలిసింది.

ఇదిలా ఉండగానే.. ఆదివారం కన్నయ్య గౌడ్ ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే, వ్యక్తిగత కారణాల వలన ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానికులు అంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఎన్నికల నిర్వహణపై ప్రభావం ఉంటుందన్న వదంతులు నియోజకవర్గ మొత్తం చర్చినీయంశంగా మారాయి. పోలీసులు అక్కడ చేరుకుని విచారణ చేపట్టారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి ఆత్మహత్య నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఎన్నికల నిర్వహణపై దాని విధివిధానాల గురించి ఎలక్షన్ కమిషన్ అధికారులతో చర్చిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed