- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీపీఆర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి వేముల..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారిని ప్రాణాపాయం బారి నుండి కాపాడేందుకు వీలుగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వివిధ వర్గాలవారికి అందిస్తున్న సీపీఆర్ శిక్షణ కార్యక్రమాన్ని శనివారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఆకస్మికంగా గుండెపోటుతో ప్రాణాపాయ స్థితికి చేరిన వారికి సీ.పీ.ఆర్ ప్రక్రియను ఎలా అందించాలనే దానిపై రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్ లు ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, సీ పీ ఆర్ అనే చిన్న ప్రక్రియ ద్వారా ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని అన్నారు. అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారిని గమనించిన వెంటనే, ఏమాత్రం తాత్సారం చేయకుండా సీపీఆర్ ప్రక్రియను అమలు చేయాలని సూచించారు. ఆరోగ్యకర సమాజ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా కోరారు.
జిల్లా కేంద్రంలోని సీతారాంనగర్ కాలనీ, బోధన్ లోని రాకాసిపెట్, ఆర్మూర్, మెండోరా, రుద్రూర్ లలోని ఆరోగ్య కేంద్రాలలో ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేకంగా మహిళా వైద్యులు, సిబ్బందిచే ప్రత్యేకంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ముఖ్యంగా ఎనిమిది రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపి, అవసరమైన వారికి జీజీహెచ్ లో చికిత్సలు చేయిస్తారని అన్నారు. రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ కోసం ఇటీవలే నిజామాబాద్ జీజీహెచ్ లో 30 లక్షల రూపాయల విలువ చేసే మామోగ్రమ్ యంత్రాన్ని కూడా అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఆకుల లలితా, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, వైద్యారోగ్య శాఖ అధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.