- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ సూత్రధారి బండి సంజయ్: మంత్రి వేముల
దిశ ప్రతినిధి, నిజామాబాద్: బాల్కొండ నియోజకవర్గంలో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో బండి సంజయ్ అరెస్టుపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. 10వ తరగతి పేపర్ లీక్ సూత్రదారి బీజేపీ బండి సంజయే అని అన్నారు. అన్ని రకాల ఆధారాలు లభించాయని లక్షల మంది పిల్లలు భవిష్యత్తు, వారి తల్లిదండ్రులు ఎంత బాధ పడతారు అని కనీస బాధ్యత లేకుండా బండి సంజయ్ ప్రవర్తించాడు అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే బీజేపీ ప్రధాన ఉద్దేశమని ఆరోపించారు. ప్రశాంత్ అనే వ్యక్తి బండి సంజయ్‌కు ఫొటో తీసిన పేపర్ వాట్సప్ ద్వారా ఫోన్లో పంపారని తెలిపారు. పరీక్ష మొదలైన 15 నిమిషాల్లోనే బండి సంజయ్‌కు ప్రశాంత్ ద్వారా పేపర్ వచ్చిందన్నారు. బండి సంజయ్, బీజేపీ వాళ్ళతో 140 సార్లు ఫోన్లో ప్రశాంత్ మాట్లాడిండు అని ప్రకటించారు. వాళ్లే ఉద్దేశ పూర్వకంగా లీక్ చేస్తారు.. వాళ్లే మీడియాకి పంపిస్తారు అన్నారు. పేపర్ లీక్ అయ్యింది.. ఆ పేపర్ నాకు వచ్చింది.. ప్రభుత్వం విఫలమయ్యింది అని ప్రచారం చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రశ్నాపత్రాల లీక్ ఇది పిల్లల జీవితాలతో చెలగాటం ఆడటమేనని అన్నారు. ఈ వ్యవహారంలో బండి సంజయ్ పాత్రపై పోలీసుల వద్ద ఆధారాలు ఉన్నాయి. చట్టం తనపని తాను చేసుకుపోతుంది అన్నారు. బండి అరెస్ట్‌పై బీజేపీ నాయకులు కేసిఆర్ దిష్టి బొమ్మ దహనం చేస్తే ఖబర్దార్.. భౌతిక దాడులు తప్పవు అని హెచ్చరించారు. పేపర్ లీక్ చేసి పిల్లల భవిష్యత్‌ను నాశనం చేయాలని చూసిన బీజేపీ బండి సంజయ్ వైఖరి పట్ల బీజేపీ కార్యకర్తలు ఆలోచన చేయాలని మంత్రి సూచించారు.