మట్కా నిర్వాహకుడికి నాలుగు రోజుల జైలు

by Sridhar Babu |
మట్కా నిర్వాహకుడికి నాలుగు రోజుల జైలు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో ఆన్ లైన్ మట్కా నిర్వహిస్తున్న రౌడీ షీటర్ నబీ కి న్యాయస్థానం నాలుగు రోజుల జైలు శిక్ష విధించిందని నగర ఒకటవ టౌన్ ఎస్ హెచ్ఓ విజయ్ బాబు తెలిపారు. ఒకటవ టౌన్ పరిధిలో ఆన్ లైన్ మట్కా నిర్వహిస్తుండగా పట్టుకుని కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరు పరుచగా నబీకి నాలుగు రోజుల జైలు శిక్ష విధిస్తూ రిమాండ్ కు పంపినట్లు ఎస్ హెచ్ఓ తెలిపారు..

పేకాట రాయుళ్లకు రెండు రోజుల జైలు....

డబ్బులను పందెంగా పెట్టి పేకాట అడుతున్న ఐదుగురు వ్యక్తులకు న్యాయస్థానం రెండు రోజుల జైలు శిక్ష విధించిందని నాల్గవ టౌన్ ఎస్ఐ సంజీవ్ తెలిపారు. నగర శివారులోని పాంగ్రాలో వాగు వద్ధ ఈ నెల 13న ఐదుగురు పేకాట అడుతుండగా పట్టుకుని న్యాయస్థానం ముందు హాజరు పరుచగా వారికి న్యాయస్థానం రెండు రోజుల సాధారణ జైలు శిక్ష విధించినట్లు ఎస్ఐ తెలిపారు.

Advertisement

Next Story