అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి..

by Vinod kumar |
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి..
X

దిశ, నిజామాబాద్ క్రైం: నిజామాబాద్ నగరంలోని ఆర్యనగర్ బ్యాంక్ కాలనీ కి చెందిన వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం వెలుగు చూసింది. బ్యాంక్ కాలనీకి చెందిన సంఘం కస్తూరి(28) ఈనెల 22న తాను పని చేసే ప్రాంతానికి వెళ్లి తిరిగి రాలేదు. ఈ విషయమై భర్త మల్లేష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

మంగళవారం బ్యాంక్ కాలనీలో ఒక శిథిలావస్థలో ఉన్న భవనం నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 4వ టౌన్ ఎస్ఐ సందీప్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ నెల 22న మిస్సింగ్ అయిన కస్తూరి అని గుర్తించారు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కస్తూరి మృతికి గల కారణాలు తెలియ రాలేదు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది.

Advertisement

Next Story