తెలంగాణ సహకార యూనియన్ లిమిటెడ్ చైర్ పర్సన్ గా మానాల మోహన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ..

by Sumithra |
తెలంగాణ సహకార యూనియన్ లిమిటెడ్ చైర్ పర్సన్ గా మానాల మోహన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ..
X

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్ లోని సహకార యూనియన్ కార్యాలయంలో పూజలు నిర్వహించి తెలంగాణ రాష్ట్రసహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు వచ్చి మోహన్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వచ్చిన నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కష్టపడి పనిచేసిన వారిని గుర్తిస్తుందని అందుకు నిదర్శనం అని తెలిపారు. పార్టీ కష్టకాలంలో మోహన్ రెడ్డి పార్టీ జెండాను భుజాలపై మోస్తూ కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకున్నారని, రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా నియమితులయ్యారు అనే ప్రక్రియలో తన వంతుగా పూర్తి మద్దతు తెలిపారని వారు అన్నారు. మోహన్ రెడ్డికి ఇంత గౌరవం దక్కింది అంటే అది ఆయన పడ్డ కష్టమేనని అన్నారు. అదేవిధంగా సుదర్శన్ రెడ్డి ఎల్లప్పుడూ మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డారని అన్నారు.

ఈ సందర్భంగా సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర చైర్మన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఇందుకు సహకరించిన జిల్లా కాంగ్రెస్ పెద్దలు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనకు ఇచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, తన మీద నమ్మకంతో తనకు ఇచ్చిన సహకార రంగాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకు వెళతానని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, బోధన్ ఎంఎల్ఏ సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, మంత్రి పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ పార్లమెంటు బాధ్యులు జీవన్ రెడ్డి, ఎంఎల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, మాజీ ఎంపీ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ప్రభుత్వ విప్ వేములవాడ ఎంఎల్ఏ ఆది శ్రీనివాస్, రూరల్ ఎంఎల్ఏ భూపతి రెడ్డి, ఏఐసీసీ అబ్జర్వర్ రోహిత్ చౌదరి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహీర్ బిన్ హందాన్, అగ్రో ఇండస్టిక్ చైర్మన్ కాసుల బాలరాజు, మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, గడుగు గంగాధర్, నాగేష్ రెడ్డి, మాజీ ఎంఎల్సీ అరికెల నర్సారెడ్డి, నిజామాబాద్ నగర అధ్యక్షులు కేశ వేణు, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు కొమురయ్య, బాల్కొండ సునీల్ రెడ్డి, ఆర్మూర్ వినయ్ రెడ్డి అలాగే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వివిధ మండలాల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed