5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలకి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం.. ఇకపై ఆ పన్ను రద్దు

by karthikeya |
5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలకి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం.. ఇకపై ఆ పన్ను రద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని 5 కోట్ల మంది ప్రజలకి సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) గుడ్ న్యూస్ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన చెత్త పన్నును పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ఇకపై చెత్త పన్ను వసూలు చేయొద్దని అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై కేబినెట్‌ (Cabinet)లో కూడా చర్చించి రద్దును ఆమోదిస్తామని ఆయన ప్రకటించారు. విజయవాడ మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో సీఎం ఈ వ్యాక్యలు చేశారు.

కాగా.. గత ప్రభుత్వ హయాంలో చెత్తను సేకరించేందుకు గానూ ప్రతి ఇంటి నుంచి రూ.50 నుంచి రూ.100 వరకు వసూలు చేశారు. దీనిపై అప్పట్లో తీవ్ర వ్యతిరేకత కూడా వచ్చినా జగన్ సర్కార్ (Jagan Government) వెనక్కి తగ్గకుండా ప్రజల ముక్కు పిండి పన్ను వసూలు చేసింది. అయితే తాజా ప్రకటనతో సీఎం చంద్రబాబు ఈ పన్నును తొలగించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తాము చెత్త (Garbage) నుంచి సంపద సృష్టించాలని చూశామని, కానీ గత ప్రభుత్వం చెత్తపై పన్నేసింది కానీ చెత్తను తొలగించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే స్వచ్ఛ కార్యక్రమాల కోసం డ్రోన్ల (Drones)ను వినియోగంపై కూడా పరిశీలన చేయబోతున్నామని, స్వచ్ఛ కార్మికులను మనందరం గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed