Flight Cancel: లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ ఫ్లైట్ రద్దు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల పడిగాపులు

by Shiva |
Flight Cancel: లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ ఫ్లైట్ రద్దు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల పడిగాపులు
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియా (West Asia)లో భీకర యుద్ధ వాతావరణం నెలకొంది. హెజ్‌బొల్లా (Hezbollah), హమాస్ (Hamas) అగ్ర నేతలను ఇజ్రాయెల్‌ (Israel) దళాలు మట్టుబెట్టిన తురుణంలో ఆ దేశంపై ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది. ఏకంగా ఒకేసారి 200 పైగా క్షిపణులను ప్రయోగించి వార్నింగ్ ఇచ్చింది. అయితే, రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ప్రపంచ వ్యాప్తంగా పలు విమానాలు రద్దు అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ శంషాబాద్ ఎయిర్‌పోర్టు (Shamshabad Airport) నుంచి జర్మనీ (Germany)కి వెళ్లాల్సిన విమానాన్ని రద్దు చేస్తున్నట్లుగా లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ అధికారులు వెల్లడించారు.

దీంతో జర్మనీ వెళ్లాల్సిన 217 మంది ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఫ్లైట్‌ను ఎలా క్యాన్సిల్ చేస్తారంటూ ప్రయాణికులు ఎయిర్‌లైన్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇజ్రాయిల్ గగనతలం నుంచి ఫ్లైట్ వెళ్లాల్సి ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా సర్వీసును రద్దు చేశామని ఎయిర్‌లైన్స్ సిబ్బంది క్లారిటీ ఇచ్చారు. జర్మనీకి వెళ్లే రీ షెడ్యూల్‌‌పై త్వరలోనే అప్‌డేట్ ఇస్తామని లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ సిబ్బంది తెలిపారు.

Next Story

Most Viewed