మచిలీపట్నంలో గాంధీ జయంతి వేడుకలు.. హాజరైన సీఎం చంద్రబాబు

by Jakkula Mamatha |
మచిలీపట్నంలో గాంధీ జయంతి వేడుకలు.. హాజరైన సీఎం చంద్రబాబు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నేడు(అక్టోబర్ 2) మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఈ రోజు మచిలీపట్నంలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకలకు హాజరయ్యారు. ఈ క్రమంలో మహానీయులు దేశానికి చేసిన సేవలను కొనియాడారు. అహింసా మార్గంలో ఉద్యమించి బానిస సంకెళ్లు తెంచి బ్రిటిష్ పాలకుల నుంచి దేశానికి విముక్తి కలిగించిన మహాత్ముడి బోధనలు నేటికీ అనుసరణీయమని సీఎం చంద్రబాబు అన్నారు.

ఆత్మాభిమానం, ఆత్మగౌరవం వేరెవరో పరిరక్షించరు.. మనకు మనమే వాటిని కాపాడుకోవాలని గాంధీ చెప్పిన మాటలు స్ఫూర్తిదాయకమన్నారు. జాతిపిత చూపిన బాటను అనుసరిస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే మన ముందున్న కర్తవ్యమని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ క్రమంలో ‘జై జవన్ జై కిసాన్’ పిలుపునిచ్చి దేశాన్ని ముందుకు నడిపించిన నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి అని చంద్రబాబు తెలిపారు. లాల్ బహదూర్ శాస్త్రి(Lal Bahadur Shastri) జయంతి సందర్భంగా దేశం గర్వించదగ్గ ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story

Most Viewed