HIT 3: సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన ‘హిట్ 3’

by Prasanna |   ( Updated:2024-10-02 15:05:20.0  )
HIT 3: సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన  ‘హిట్ 3’
X

దిశ, వెబ్ డెస్క్ : నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘దసరా’, ‘హాయ్ నాన్న’ ‘సరిపోదా శనివారం’ ఇలా వరుస హిట్స్ తో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఆ తర్వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అని చాలా మంది ఎదురు చూసారు. ఈ క్రమంలోనే ‘బలగం’ వేణు పేరు వినిపించగా.. కానీ, ఎవరు ఊహించని విధంగా నాని, శైలేష్ కొలనుకి అవకాశం ఇచ్చాడు. ఇది కొత్త ప్రాజెక్ట్ ఏమీ కాదు. ‘హిట్ 2’ ( HIT 2) టైంలోనే దీనిని అనౌన్స్ చేశారు.

హిట్ 3 కి సంబంధించి ఓ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. దానిలో అర్జున్ సర్కార్.. గా నాని చాలా మాస్ గా కనిపించాడు. ‘హిట్ ’ , ‘హిట్ 2’ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనకీ తెలిసిందే. మరో వైపు ‘హిట్ 3’ షూటింగ్ కూడా మొదలైంది.

అయితే, ‘హిట్ 3′ కి సంబంధించిన షూట్ వైజాగ్ లో జరుగుతుంది. ఎలా లీక్ అయిందో ఎవరికీ తెలీదు దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ’కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి నాని సరసన నటిస్తోంది.

Advertisement

Next Story