ఇంటర్ పరీక్షల్లో ఇద్దరి పై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు

by Sridhar Babu |   ( Updated:2024-03-04 12:23:01.0  )
ఇంటర్ పరీక్షల్లో ఇద్దరి పై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు
X

దిశ, నిజామాబాద్ సిటీ : సోమవారం జరిగిన మొదటి సంవత్సరం గణితం 1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ (సివిక్స్) పరీక్షల్లో జిల్లాలో ఇద్దరి పై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాగా 809 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరు అయ్యారని జిల్లా ఇంటర్ విద్య అధికారి శ్రీ రఘురాజ్ తెలియజేశారు. బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక విద్యార్థి, అలాగే విజేత జూనియర్ కళాశాలలో ఒక విద్యార్ధి కాపీయింగ్ చేస్తుండగా ఫ్లైయింగ్ స్క్వాడ్ పట్టుకుని మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేశామని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తెలిపారు. జిల్లాలో ఈరోజు 96 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. జిల్లాలో ఈ రోజు బోర్డ్ స్క్వాడ్ కూడా పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారని తెలిపారు.

జిల్లాలో మొత్తం 57 పరీక్ష కేంద్రాలకు గాను జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ, స్క్వాడ్ ల ఆధ్వర్యంలో 47 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించామని తెలియజేశారు. జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ నిజామాబాద్ లోనీ కాకతీయ మహిళా జూనియర్ కళాశాల, శ్రీ కాకతీయ ఏ, బీ పరీక్ష కేంద్రాలు, సీ.ఎస్.ఐ కళాశాల తో పాటు మరో 2 కళాశాలలు, జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు శ్రీ రవికుమార్, శ్రీ రజియుద్ధిన్ అస్లాం, శ్రీ దేవరామ్ లు 6 పరీక్ష కేంద్రాలను, హైపవర్ కమిటీ డాక్టర్ చిరంజీవి ఆధ్వర్యంలో 9 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు. అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్లు 19 పరీక్ష కేంద్రాలను, సిట్టింగ్ స్క్వాడ్ లు 8 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారని తెలియజేశారు.

పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా ఇంటర్ విద్యా అధికారి శ్రీ రఘురాజ్ తెలిపారు. సెంటర్లను, విశ్వశాంతి జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని, అలాగే వర్నిలోని మోడల్ కాలేజ్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు శ్రీ రవికుమార్, శ్రీ రజియుద్ధిన్ అస్లాం, శ్రీ దేవరామ్ లు 8 పరీక్ష కేంద్రాలను, హైపవర్ కమిటీ డాక్టర్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏడు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు. అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్లు 24 పరీక్ష కేంద్రాలను, సిట్టింగ్ స్క్వాడ్ లు 8 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారని తెలియజేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా తగిన చర్యలు తీసుకున్నామని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed