కేసీఆర్ పాలన కంటే నిజాం పాలన మేలు..

by Sumithra |
కేసీఆర్ పాలన కంటే నిజాం పాలన మేలు..
X

దిశ, నిజామాబాద్ సిటీ : కేసీఆర్ పాలన కంటే నిజాంపాలన మేలని కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా నాయకత్వంలో పేదోళ్ల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధనకై మహా ధర్నా నిర్వహించారు. ఈ మహాధర్నాకు ముఖ్యఅతిథిగా చేవెళ్ల మాజీ మంత్రి కొండవిశ్వేశ్వర్ రెడ్డి విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఒక వ్యక్తి పొద్దున లేచి సూర్య నమస్కారం చేసి పని మొదలు పెట్టి దేశ సేవ చేస్తారని ఆయనే ప్రధాన మంత్రి మోదీ అని అన్నారు.

రాష్ట్రంలో ఇంకో వ్యక్తి ఎప్పుడు పంటాడో, ఎప్పుడు లేస్తాడో ఎవరికి తెలియదని ఆయనే కేసీఆర్ అన్నారు. ధనిక రాష్ట్రం అయిన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందన్నారు. దళితున్ని సీఎం చేస్తానని, దళితులకు మూడెకరాలు భూమి ఇస్తానని, దళిత బంధు ఇస్తానని మాయ మాటలు చెప్పి నట్టేట ముంచాడన్నారు. చదువుకున్న వాళ్ళందరిని మోసంచేసి ఉద్యోగాలు ఇవ్వకుండా తన కుటుంబానికి మాత్రం పదవులు ఇచ్చుకున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరట కమిషన్లు దోచుకున్నారన్నారు. రైతులను ధరణి పోర్టల్ ద్వారా ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు.

23,679 వేల కోట్ల బడ్జెట్ లో 383 కోట్లు ఖర్చు పెట్టలేరని అన్నారు. తెలంగాణకు ఆర్ఘికంగా కల్వకుంట్ల రోగం వచ్చిందని, తెలంగాణ ద్రోహులు తప్ప ఆ పార్టీలో ఎవరు ఉండరని హెద్దేవా చేశారు. ప్రభుత్వ భూములు అమ్ముకుంటు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించుతున్నారన్నారు. కేంద్రంలో మోడీ సర్కారు ఏం చేస్తలేదని అబద్ధపు మాటలు చెబుతున్న కేసీఆర్ కు దేశ ప్రజలకు కరోన సమయంలో ఉచిత వ్యాక్సిన్ లు, ఉచిత రేషన్ పంపిణీ, మహిళా సంఘాలకు గ్యాస్ కనెక్షన్ లు, రైతులకు మద్దతు ధర కల్పించి, అవాస్ యోజన పథకం కనిపించడం లేదా అని అన్నారు.

అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ గుప్త మాట్లాడుతూ ఎమ్మెల్యేకు అవినీతి, కబ్జాల మీద ఉన్న శ్రద్ద సేవ, అభివృద్ధి మీద లేకపోయిందని అన్నారు. మేయర్ భర్త, ఆయన అనుచరులు జిల్లా కేంద్రంలో భూముల కబ్జాలు చేస్తూ రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా నిలుస్తున్నాయన్నారు. కమిషన్లు దేంట్లో ఎక్కువగా వస్తే ఆ పనులు మాత్రమే చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అస్తవ్యస్తంగా మారిందన్నారు. జిల్లాలో 9 ఏళ్లలో 540 ఇల్లు కట్టిండ్రని, నెలకు 5 ఇండ్లు చొప్పున కట్టి, నెలకు 500 ప్లాట్స్ కబ్జా చేస్తున్నారన్నారు. ప్లాట్ ఉన్న వాళ్లకు 3 లక్షలు అంటే ఎమ్మెల్యే, మేయర్ అనుచరులకు లబ్ది చేకూరుతుందన్నారు.

ాబడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఎద్దేవాచేశారు. జిల్లాలో ప్రభుత్వ దవఖాన, ప్రభుత్వ స్కూల్లో పరిస్థితి అధ్వానంగా తయారైందని, 1500 వందల కోట్లు ఖర్చు చేసామని చెప్పి 300 కోట్లు కూడా ఖర్చు చేయలేదని, ఎమ్మెల్యే తమ్ముడి మీద ఆరోపణ వస్తే ఎఫ్ఐఆర్ కూడా బుక్ కాలేదంటే ఎమ్మెల్యే హస్తం ఉందో లేదో అర్థమవుతుందని అన్నారు. త్వరలోనే బీఆర్ఎస్ నాయకుల భరతం పడతామన్నారు. డబుల్ బెడ్ రూములు ఇండ్లు కూలే దశకు వచ్చినా లబ్ధిదారులు కనిపించడం లేదా అన్నారు. మార్చి 31 లోపు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయకుంటే బీజేపీ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు మేమే పంపిణీ చేస్తామని హెచ్చరించారు.

బీజేపీ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేస్తే చదువుకున్న యువత మహిళలు, రైతుల, గోసలు చూస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల బాధలను గాలికి వదిలినట్టు అర్థమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షడు పెద్దోళ్ల గంగారెడ్డి, మెడిపాటి ప్రకాష్ రెడ్డి, పల్లె గంగారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పొత్తన్కర్ లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, జిల్లా ఉపాధ్యక్షులు నాగోల్ల లక్ష్మీనారాయణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి, రెడ్డి కార్పొరేటర్లు పంచ రెడ్డి ప్రవళిక, మాస్టర్ శంకర్, సుక్క మధు, బూర్గుల వినోద్, ఇప్పకాయల కిషోర్, సీనియర్ నాయకులు భరత్ భూషణ్, మండల అధ్యక్షులు గడ్డం రాజు, రోషన్ లాల్, బోరపుట్ట వీరేందర్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed