- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధాన్యం బస్తాకు రూపాయి వసూలు చేస్తున్న లారీ డ్రైవర్లు
దిశ , నాగిరెడ్డిపేట్ : లారీ డ్రైవర్లు రైతన్నల వద్ద ధాన్యం బస్తాకు ఒక్క రూపాయి చొప్పున వసూలు చేస్తూ..రైతులను నట్టేట ముంచుతున్నారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని మాల్ తుమ్మెద, తాండూర్ కిచ్చన్నపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలోని గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో గత మూడు రోజుల క్రితం ధాన్యం తూకం వేసి కొనుగోళ్లు ప్రారంభించగా..ధాన్యం బస్తాలను రైస్ మిల్లులకు రవాణా చేసేందుకు లారీ డ్రైవర్లు రైతుల వద్ద ధాన్యం బస్తాకు బస్తాకు ఒక్క రూపాయి చొప్పున ఇస్తేనే లారీలను కేంద్రాలకు తీసుకువస్తామని, లేదంటే రామని ఖరాఖండిగా చెప్పడంతో చేసేదేమీ లేక రైతన్నలు తమ రెక్కల కష్టాన్ని దళారులకు దారాదత్తం చేస్తున్నారు. ధాన్యం రవాణాకు చిన్న లారీలలో 750 నుండి 800 బస్తాలు లోడింగ్ అవుతుండగా..పెద్ద లారీలలో 950 బస్తాల నుండి 1000 బస్తాల వరకు నింపుకుని రైస్ మిల్లులకు రవాణా చేస్తుంటారు. మాల్ తుమ్మెద లారీ డ్రైవర్లు రైతన్నల వద్ద ధాన్యం బస్తాకు ఒక్క రూపాయి చొప్పున వసూలు చేస్తూ..రైతులను నట్టేట ముంచుతున్నారు.సొసైటీ పరిధిలో శుక్రవారం నాటికి 50 వేల బస్తాల ధాన్యం రైస్ మిల్లులకు రవాణా జరగగా..తాండూర్ సొసైటీ పరిధిలో సుమారు 65 వేల బస్తాల ధాన్యం రవాణా జరిగింది.
ఈ రెండు సొసైటీల పరిధిలోనే రైతుల వద్ద నుండి లారీ డ్రైవర్లకు బస్తాకు రూపాయి చొప్పున సుమారు 1 లక్షా 20 వేల రూపాయల వరకు రైతుల వద్ద నుండి డబ్బులు లారీ డ్రైవర్లు వసూలు చేశారు. ఈ చొప్పున ఒక్క మండలం నుండే వారం రోజుల వ్యవధిలో 1 లక్షా 20 వేల రూపాయలు రైతులు నష్టపోతుండగా, జిల్లా వ్యాప్తంగా లక్షల రూపాయల్లో రైతులు నష్టపోతున్నారు. లారీ డ్రైవర్లు ధాన్యం బస్తాకు ఒక్కంటికి రూపాయి చొప్పున వసూలు చేస్తున్నప్పటికీ అడ్డుకోవాల్సిన సొసైటీ పాలకవర్గం డైరెక్టర్లు, అధికారులు సైతం లారీ డ్రైవర్లకు వత్తాసు పలుకుతూ రైతుల వద్ద డబ్బులు వసూలు చేయిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వరి ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరిట రైస్ మిల్లర్లు, సొసైటీలు రైతులను నిలువునా దోపిడీ చేస్తుండగా ..మరోవైపు లారీ డ్రైవర్లు బస్తాకు రూపాయి చొప్పున వసూలు చేస్తూ అన్నదాతలను ఆగం చేస్తుంటే చర్యలు చేపట్టాల్సిన జిల్లా ఉన్నత అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని రైతన్నలు ఆరోపిస్తున్నారు. రైతులను అన్ని విధాలుగా దోపిడీ చేస్తున్నప్పటికీ ప్రభుత్వపరంగా ఎమ్మెల్యేలు కానీ..అధికారపరంగా జిల్లా ఉన్నతాధికారులు కానీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో.. రైతన్నలు కన్నీటి పర్యంతరమై తమ బాధను ఎవరికి చెప్పుకోలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రైతన్న సమస్యలను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.
జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలి
లారీ డ్రైవర్లు రైతుల వద్ద నుంచి ధాన్యం రవాణా చేసేందుకు బస్తాకు రూపాయి చొప్పున వసూలు చేస్తున్నారని రైతులు తెలిపారు. రాత్రనక పగలనక కష్టపడి పండించిన ధాన్యం విక్రయించి దళారులను నడిపినట్లు అవుతుంది. సొసైటీ పాలకవర్గం గానీ అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. లారీ డ్రైవర్లు రైతుల వద్ద వసూలు చేయకుండా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.