- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేపర్ లీకేజీ వ్యవహారంలో మంత్రి సబితా రాజీనామా చేయాలి..
దిశ, కామారెడ్డి రూరల్ : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి పదవికి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు ఎడ్ల రాజు డిమాండ్ చేశారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సూత్రధారులు కేటీఆర్ పీఏ, తిరుపతి, రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్, రేణుకతో పాటు మరికొంతమంది నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కోచింగ్ ల కోసం విద్యార్థులు అప్పులు చేసినట్లు తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఉద్దేశ్యంతో గత రెండు సంవత్సరాల నుంచి కోచింగ్ తీసుకుంటున్నారన్నారు. ఈ పేపర్ లీకేజీతో నిరుద్యోగులకు చివరకు నిరాశే మిగిలిందన్నారు. దీనికి బాధ్యులను చేస్తూ టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు కమిటీ మెంబర్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఒక్కొక్కరికి ఐదు లక్షల పరిహారం చెల్లించాలని కోరారు. అలాగే ఈ నెల నుంచే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3,016 తక్షణమే చెల్లించాలన్నారు. లేనిచో రాష్ట్రవ్యాప్తంగా మాలమహానాడు, ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.