కబ్జా కోరల్లో కోతుల ఆహార వన స్థలం

by Mahesh |
కబ్జా కోరల్లో కోతుల ఆహార వన స్థలం
X

దిశ, గాంధారి: పట్టపగలే యదేచ్చగా కోతుల ఆహార వనం ట్రాక్టర్ తో దున్నుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రానికి సంబంధించిన కోతుల ఆహారవణం మాదంటే మాదని ఇరు గ్రామాల ప్రజలు ఇదివరకే వాగ్వాదం జరగగా ఇప్పటికే కేసు నమోదు అయినా మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. స్థానికులు, ఫారెస్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం లంబాడీల్లో పోడు భూమి పట్టాల్లో పంపిణీలో భాగంగా కోతుల ఆహార వనం కేటాయించిన భూమిలో కొంత తల సర్వే నెంబర్ లో వచ్చిందని అందుకోసమే దున్నుతున్నానని గిరిజనుల వాదన ఉండగా.. గాంధారి మండల ప్రజానీకం ఇదివరకే పోడు భూమిని గ్రామపంచాయతీ, ఎన్ఆర్ఈజీఎస్‌కు ఐదు ఎకరాల భూమిని అందులో మూడు ఎకరాలను కోతుల ఆహార వనం నిర్మించగా ఇంతకుముందు ఒకసారి గొడవలు జరిగి వాగ్వాదానికి దారితీసిన సంఘటన ఇదివరకే ఒకసారి జరిగింది. ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు పోలీస్ స్టేషన్ లో గిరిజనులపై అక్రమంగా దున్నుతున్నారని కేసు పెట్టడం కూడా జరిగింది. ఈ కేసు ఎల్లారెడ్డి జ్యూడిషల్ కోర్టు పరిధిలో ఉన్నాయి. అయితే ఐదు ఎకరాలు కేటాయించిన ఇందులో మూడు ఎకరాలు కోతుల ఆహార మనం ఏర్పాటు చేయగా రెండు ఎకరాలు ఇంకా అలాగే ఉంది. ఇదిలా ఉండగా ఎన్నికరాల సంగతి దేవుడెరుగు కానీ మూడెకరాల స్థలంలోనే మళ్లీ కేసు నడుస్తున్న నేపథ్యంలో కూడా ట్రాక్టర్ తో యదేచ్ఛగా దున్నడం దేనికి సంకేతం అని గ్రామస్థులు తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సరిగ్గా సర్వే చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది-గ్రామస్తులు

ఫారెస్ట్ అధికారులు ఆ పొడు భూమి పట్టా పొందిన లబ్ధిదారుడు, గాంధారి మండలనికి చెందిన కోతుల ఆహార వనంను దాని యొక్క సర్వే నంబర్ను తీసుకొని రెవెన్యూ, ఫారెస్ట్ ఆధ్వర్యంలో సంయుక్తంగా సర్వే చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని గ్రామస్తుల అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ఇదివరకే కేసులు ఉండగా పోడు భూములలో పట్టా వచ్చిందని 5 ఎకరాల్లో రెండు ఎకరాలను విడిచిపెట్టి అటవీ శాఖ ద్వారా ఇచ్చినటువంటి భూమిని గ్రామ పంచాయతీ ఎన్ఆర్ఈజీఎస్ ఆధ్వర్యంలో కోతుల ఆహార వనం ఏర్పాటు చేసిన అందులోనే కావాలని దున్నడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సరిగ్గా సర్వే చేస్తే ఎవరు భూమి ఇట్టే తెలిసిపోతుందని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed