Minor girl: స్కూల్ విద్యార్థినులపై బస్సు డ్రైవర్ లైంగిక వేధింపులు.. నిందితుడి అరెస్ట్

by vinod kumar |
Minor girl: స్కూల్ విద్యార్థినులపై బస్సు డ్రైవర్ లైంగిక వేధింపులు.. నిందితుడి అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో మరో దారుణం చోటు చేసుకుంది. పూణె నగరంలో ఇద్దరు ఆరేళ్ల బాలికలపై పాఠశాల బస్సు డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. గత నెల 30న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని వాన్‌వాడి ప్రాంతంలో పాఠశాలకు హాజరైన విద్యార్థినులు బస్సులో ఇంటికి తిరిగి వస్తుండగా బాలికల ప్రయివేట్ పార్ట్స్‌ను తాకుతూ డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించారు. అనంతరం వారిని బెదిరింపులకు గురి చేశారు. దీంతో బాధిత బాలికలు జరిగిన విషయం తమ కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు సంజయ్ రెడ్డిని అరెస్ట్ చేశారు. పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కాగా, మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో ఇద్దరు నాలుగేళ్ల బాలికలపై పాఠశాల అటెండర్ లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేయగా ఇటీవలే పోలీసుల కాల్పుల్లో మరణించారు. ఈ క్రమంలోనే అదే తరహా ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed