మంత్రి సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన స్టార్ హీరో.. సెన్సేషనల్ కామెంట్స్!

by Jakkula Mamatha |   ( Updated:2024-10-03 09:31:21.0  )
మంత్రి సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన స్టార్ హీరో.. సెన్సేషనల్ కామెంట్స్!
X

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ మంత్రి(Telangana Minister) కొండా సురేఖ అక్కినేని ఫ్యామిలీలో విడాకుల పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆమె చేసిన వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఈ క్రమంలో సమంత(Samantha) విడాకులపై మంత్రి సురేఖ(Konda Surekha) చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పై హీరో మహేష్ బాబు స్పందించారు. ఓ మహిళా మంత్రి మరో మహిళ పై చేసిన ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలు, భాష పట్ల తీవ్ర వేదనకు గురయ్యాను అన్నారు. సురేఖ చౌకబారు వ్యాఖ్యలను ఖండిస్తున్నాం అని తెలిపారు. ఒక కూతురి తండ్రిగా, భార్యకు భర్తగా, తల్లికి కొడుకుగా ఎదుటి వారి మనోభావాలను దెబ్బతీయనంత వరకు వాక్‌స్వేచ్ఛను ఉపయోగించుకోవచ్చు. సినీ వర్గాన్ని సాఫ్ట్ టార్గెట్‌గా మార్చుకోవద్దని పబ్లిక్‌గా అభ్యర్థిస్తున్నా అని మహేష్ బాబు(Mahesh Babu) ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed