Nandigam Suresh : మాజీ ఎంపీ నందిగం సురేష్‌ రిమాండ్‌ పొడిగింపు

by Mahesh |
Nandigam Suresh : మాజీ ఎంపీ నందిగం సురేష్‌ రిమాండ్‌ పొడిగింపు
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021లో మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం (Mangalagiri TDP Office)పై దాడి జరిగింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ (Nandigam Suresh)‌ను మంగళగిరి పోలీసులు హైదరాబాద్‌ (Hyderabad)లో అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పరిచారు. కాగా తనకు బెయిల్ ఇవ్వాలని రెండోసారి కోర్టును ఆశ్రయించగా.. పూర్తిస్థాయిలో విచారణ జరిపిన కోర్టు.. తీర్పును రిజర్వు చేసి ఈ నెల 4కు వాయిదా వేసింది. దాడిలో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ కు బెయిల్ ఇవ్వొద్దని, ఈ కేసు ఇంకా విచారణ దశలో ఉందని.. బెయిల్‌ ఇవ్వొద్దని ప్రభుత్వం ప్రభుత్వం తరుఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ రిమాండ్‌ పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. మరో 14 రోజులపాటు ఆయన రిమాండ్‌ పొడిగించిన కోర్టు తెలిపింది. అయితే బెయిల్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వు చేయగా.. రేపు ఎటువంటి నిర్ణయం ప్రకటించబొతుందోననే టెన్షన్ వైసీపీ శ్రేణుల్లో నెలకొంది.

Next Story