నేల రుణం తీర్చలేనిది: RTC chairman Bajireddy Govardhan

by Kalyani |   ( Updated:2022-12-05 14:59:43.0  )
నేల రుణం తీర్చలేనిది: RTC chairman Bajireddy Govardhan
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్:నేల లేకపోతే ఆహారం లేదు, ఆహారం లేకపోతే జీవం లేదు, ఈ సర్వజీవులకు ఆధారం నేల అని ఎన్ని జన్మలెత్తినా నేల రుణం తీర్చలేనిదని రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ అన్నారు.సోమవారం ప్రపంచ మృత్తికా (నేలల) దినోత్సవం కార్యక్రమం డిచ్ పల్లి మండలం బర్దిపూర్ లో రైతు వేదికలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హజరై మాట్లాడుతూ మార్పిడి పంటలు వేసి భూసారం కాపాడుదాం, ప్రతి ఒక్కరూ ఆయిల్ ఫామ్పం టను వేయాలని సూచించారు. ఈ పంట వల్ల ఎక్కువ దిగుబడి ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, డిచ్ పల్లి మండల జడ్పీటీసీ దాసరి ఇందిరా, సర్పంచ్ లా ఫోరం అధ్యక్షుడు మోహన్ రెడ్డి, సర్పంచులు, సొసైటీ చైర్మన్ జైపాల్ రెడ్డి, ఎంపీటీసీలు సాయిలు, సొసైటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story