- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఖలీల్ వాడీ కాదది... ట్రాఫిక్ వాడీ
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం ఖలీల్ వాడి. ప్రతినిత్యం రద్దీగా ఉండే ఈ ఖలీల్ వాడి ప్రాంతంలో అసలే ఇరుకు సందులు. రోడ్డుకు ఇరుపక్కలా హాస్పిటల్స్. నిత్యం వేల మంది రోగులు హాస్పిటల్స్ కు వస్తూపోతూ ఉంటారు. వీటికి తోడు అంబులెన్సుల రాకపోకలు. ఏ హాస్పిటల్ కు పార్కింగ్ ప్లేస్ లేదు. వాహనం పార్క్ చేయాలంటే రోడ్డు పైనే చేయాలి. ఇంత రద్దీ ప్రాంతంలో అడ్డగోలుగా పార్కింగ్ చేసే వాహనదారుల కారణంగా పాదచారులు రోడ్డుపై నడవడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది.
ఎట్టకేలకు స్పందించిన ట్రాఫిక్ పోలీసులు..
రోడ్డు మీద వాహనాలు పార్కింగ్ చేయవద్దని హాస్పిటల్ సిబ్బందికి, మెడికల్ షాపులు, ఆ ప్రాంతంలోని ఇతర దుకాణ సముదాయాల వారికి ట్రాఫిక్ సీఐ వెంకట నారాయణ ఎన్నో సార్లు సూచించారు. అయినా ఫలితం లేదు. దీంతో శుక్రవారం రోడ్డుమీద ట్రాఫిక్ అంతరాయం కలిగించిన వెహికల్స్ అన్నింటినీ క్రేన్ ద్వారా ఎత్తి వాటన్నింటినీ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ...రోడ్డు మీద వాహనాలు నిలపడంతో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని, ట్రాఫిక్ కు తీవ్రంగా అంతరాయం కలుగుతుందన్నారు. హాస్పిటల్స్ మేనేజ్ మెంట్, దుకాణదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పార్కింగ్ ను ఏర్పాటు చేసుకోవాలని హాస్పిటల్స్ కు, వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా హాస్పిటల్స్ ఎదుట, షాపుల ఎదుట పార్కింగ్ కోసం ట్రాఫిక్ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
- Tags
- traffic