కవిత మాదిరి కమీషన్లకు కక్కుర్తి పడే వ్యక్తిని కాదు

by Sridhar Babu |
కవిత మాదిరి కమీషన్లకు కక్కుర్తి పడే వ్యక్తిని కాదు
X

దిశ, నవీపేట్ : ఎమ్మెల్సీ కవిత మాదిరిగా తాను కమీషన్ల కు కక్కుర్తి పడే వ్యక్తిని కానని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని సరయు కన్వెన్షన్ హాలులో శుక్రవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బోధన్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ హాజరై మాట్లాడుతూ కవిత లా కమీషన్లకు కక్కుర్తి పడే వ్యక్తిని కాదని, గెలిచిన వంద రోజుల్లో ఎన్ ఎస్ ఎఫ్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని మాట ఇచ్చి తప్పిందని అన్నారు. దేశ వ్యాప్తంగా మూతపడ్డ 53 చక్కెర కర్మాగారాలను తెరిపించడం సాధ్యమైంది ఒక్క భారతీయ జనతా పార్టీతోనే అని,

బోధన్ చక్కెర కర్మాగారాన్ని కూడా భారతీయ జనతా పార్టీ పునరుద్ధరిస్తుందని అన్నారు. త్వరలోనే బోధన్ లో అతి పెద్ద రైల్వే జంక్షన్ ఏర్పాటు చేస్తామని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్ కా సత్ సబ్ కా వికాస్, వికసిత్ భారత్, భేటీ బచావో భేటీ పడవో, ఉజ్వల యోజన, అయుష్మాన్ భారత్, సుకన్య యోజన, ముద్ర లోన్స్ వంటి అనేక సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందారని అన్నారు. కొన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు కేంద్ర ప్రభుత్వం సహాయం లేకుండా తమ ప్రభుత్వమే అన్ని సంక్షేమ పథకాలు అందిస్తుందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ ని గెలిపించాలని ప్రజలు ఇప్పటికే డిసైడై ఉన్నారని అన్నారు.

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ పటిష్టత కోసం పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీని గెలిపించేలా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని అన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికే టికెట్ దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెడపాటి ప్రకాష్ రెడ్డి,రాష్ట్ర నాయకులు లక్ష్మీనారాయణ, నాయకులు నర్సింహా రెడ్డి, సుధాకర్ చారి, అసెంబ్లీ కన్వీనర్ కురెళ్ల శ్రీధర్, ఎడపల్లి మండల అధ్యక్షుడు కోలా ఇంద్రకరణ్, రెంజల్ జెడ్పీటీసీ మేక విజయ సంతోష్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పు సురేష్, నాయకులు బూత్ స్థాయి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story